హైదరాబాద్: అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటల వివరాలపై వారం రోజుల్లో నివేదిక పంపాలని మంత్రి రఘువీరారెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో రెండు రోజులు కురిసిన అకాల వర్షాలపై సమీక్షించేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి అధికారులతో సచివాలయంలో సమావేశమయ్యారు. సమావేశం అనంతరం మంత్రి రఘువీరారెడ్డి విలేకరులతో మాట్లాడారు. చనిపోయిన 18 కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. ఇళ్లు కోల్పోయిన వారికి పరిహారం ఇవ్వాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్టు చెప్పారు. పంటలు దెబ్బతిన్న జిల్లాల కలెక్టర్లతో రేపు సీఎన్ వీడియో కాన్ఫరెన్సు నిర్వహిస్తారని చెప్పారు. ఎన్నికల కోడ్ దృష్ట్యా ఈసీ అనుమతి మేరకు 3 జిల్లాల్లో సీఎం పర్యటిస్తారని చెప్పారు.




