Wednesday, 4 November 2026

స్థానిక ఎన్నికలకు సుప్రీం అనుమతి

హైదరాబాద్‌: గత కొన్ని రోజులుగా వాయిదా పడిన స్థానిక ఎన్నికలకు అనుమతినిస్తూ సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50 శాతానికి కట్టుబడి ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ప్రస్తుత రిజర్వేషన్ల విధానంలోనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. బీసీ జనగణన పూర్తయ్యాకే ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు ఉత్తర్వులపైనా స్టే విధించింది. దీంతో స్థానిక ఎన్నికలకు మార్గం సుగమం అయింది. దినిపై స్పందించిన రాష్ట్ర ఈసీ రమాకాంత్‌రెడ్డి ప్రభుత్వం నుంచి ప్రతిపాధనలు వచ్చిన 90 రోజుల్లో స్థానిక ఎన్నికలు పూర్తి చేస్తామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *