…
డోర్నకల్ ప్రతినిధి జనవరి 21 (జనం సాక్షి): మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల పరిధి రూపుల తండా శివారు లో పూసల తండా కు చెందిన బాదావత్ ధర్మానాయక్ (70) ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే డి ఎస్ రెడ్యా నాయక్ మృత్యు కుటుంబాన్ని పరామర్శించి చిత్రపటానికి పూలమాల ఏసీ నివాళులర్పించారు. పార్టీ అండగా ఉంటుందని మృత్యుని కుటుంబ సభ్యులకు మన ధైర్యాన్ని కల్పించారు. ఆయన వెంట సర్పంచ్ లక్ష్మీ లక్ష్మణ్, ఉప సర్పంచ్ నాగేష్, వైయస్ ఎంపీపీ జాటో దేవేందర్ మండల పార్టీ బి ఆర్ఎస్ అధ్యక్షుడు మైదుమ్ దేవేందర్ పార్టీ అధ్యక్షులు శ్రీను, పటేల్ రామన్న, సలుగు వెంకన్న కార్యకర్తలు స్థానికులు పాల్గొన్నారు.
మృత్యుని కుటుంబాన్ని పరామర్శ. ఎమ్మెల్యే రెడ్యా నాయక్




