ఖమ్మం జిల్లాలో పర్యటించిన మంత్రులు కేటీఆర్, తుమ్మల నాగేశ్వరరావు… జిల్లాలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. బుగ్గపాడులో 110 కోట్ల రూపాయల వ్యయంతో మెగాఫుడ్ పార్క్‌ను నిర్మించనున్నామన్నారు. మారుమూల ప్రాంతాలకు పారిశ్రామిక రంగం విస్తరణే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రులు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడులో మెగాఫుడ్ పార్క్‌కు మంత్రులు కేటీఆర్, తుమ్మల శంకుస్థాపన చేశారు. పారిశ్రా
మిక రంగంలో రైతులను భాగస్వాములుగా చేరుస్తామన్నారు. బుగ్గపాడు మెగా ఫుడ్‌పార్క్ ఏర్పాటు ద్వారా 30 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. అన్ని జిల్లాల్లో పారిశ్రామిక రంగాన్ని విస్తరింపజేస్తామన్నారు కేటీఆర్. రైతాంగ శ్రేయస్సే లక్ష్యంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం పని చేస్తోందన్న కేటీఆర్… కానీ కొందరు బురద చల్లాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
మెగాఫుడ్ పార్క్…!!!




