Thursday, 5 November 2026

మెట్పల్లిలో అయ్యప్ప స్వామి ఆరట్టు పాల్గొన్న ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు

మెట్పల్లిలో అయ్యప్ప స్వామి ఆరట్టు పాల్గొన్న ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు*
మెట్పల్లి పట్టణంలో అయ్యప్ప దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి ఆరట్టు కార్యక్రమం అంగరంగ వైభవంగా ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పాల్గొన్నారు,
అయ్యప్ప దేవాలయం నుండి స్వాముల ర్యాలీలో భాగంగా ఎమ్మెల్యే దంపతులు వారి స్వగృహం వద్ద మంగళహారతులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే అయ్యప్ప భక్తులతో ర్యాలీగా వెళ్లి చెన్న కేశవ ఆలయం వద్ద ఉన్న కోనేరులో అయ్యప్ప పంచామృత అభిషేకం, మరియు చక్రస్నానం అనంతరం చెన్న కేశవ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపినారు,ఈ కార్యక్రమంలో గురు స్వాములు అయ్యప్ప భక్తులు పట్టణ ప్రజలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు