Wednesday, 4 November 2026

మెట్రోరైల్‌ ద్వారా యువత స్ఫూర్తి పొందాలి ఎండీ ఎస్‌. వి.ఎస్‌ రెడ్డి

హైదరాబాద్‌ : మెట్రోరైల్‌ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా హైదరాబాద్‌ పైన మరో కొత్త నగరాన్ని అవిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నట్లు హైదరాబాద్‌ మెట్రోరైల్‌ ఎండీ ఎస్‌.వి.ఎస్‌. రెడ్డి తెలిపారు. యువతను లక్ష్యం దిశగా నడిపించేందుకు ‘ఇగ్నైట్‌ హైదరాబాద్‌’ అనే స్వచ్ఛ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అయన పాల్గొన్నారు. కేవలం రవాణా కోణంలో మెట్రోను నిర్మించడం లేదని, ప్రజలకు అహ్లాదాన్ని పంచే సదుపాయంగా తీర్చిదిద్దుతున్నామని వివరించారు. ప్రపంచంలోనే అత్యంత గొప్ప ఇంజినీరింగ్‌ ప్రాజెక్టుగా ఎంపికైన మెట్రోరైల్‌ ద్వారా యువత స్ఫూర్తి పొందవచ్చన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *