విశాఖపట్నం,(జనంసాక్షి): రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. నెల్లూరు జిల్లా జలదంకిలో 10.4 సెం.మీ, బోగోలులో 6.6 సెం.మీ, కొండాపురంలో 6.4 సెం.మీ, దోగదర్తి: 6.1 సెం.మీ, ప్రకాశం జిల్లా గుడ్లూరులో 10.2 సెం.మీ, లింగసముద్రంలో 8.8 సెం.మీ, వలేటివారిపాలెంలో 6.7 సెం.మీ, విజయనగరం జిల్లా బొబ్బిలిలో 6.6 సెం.మీ, కృష్ణ జిల్లా నందివాడలో 6.5సెం.మీ, మచిలీపట్నంలో 6.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది.




