మెట్ పల్లి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు నూతన డ్రెస్ కోడ్ దుస్తులు పంపిణి*
*మున్సిపల్ చైర్ పర్సన్ రాణవేణి సుజాత ఆధ్వర్యంలో*
మెట్పల్లి టౌన్, నవంబర్ 30,
జనం సాక్షి:
మెట్పల్లి పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో బుధవారం రోజున మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు విధులలో వాడే నూతన డ్రెస్ కోడ్ బట్టలను మున్సిపల్ చైర్ పర్సన్ రానావేని సుజాత సత్య నారాయణ పారిశుద్ధ కార్మికులకు పంపిణీ చేశారు, ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ కార్మికులకు ఏ అవసరము ఉన్న ఎప్పటికప్పుడు వారికి సౌలభ్య వసతులు కల్పించడం జరుగుతుందని విధులలో ఉండే కార్మికులకు ఈ నూతన మున్సిపల్ కోడ్ దుస్తులు వారికి రక్షణ కవచంగా ఉంటుందని ప్రతి సంవత్సరం యధావిధిగా పంపిణీ జరుగుతుందని ఇవేగాక ఇతరత్రా వారికి వచ్చే వస్తువులు, మరియు ఆరోగ్య పరంగా కూడా అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని అన్నారు ,ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రానావేని సుజాత సత్యనారాయణ, వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖర రావు, కౌన్సిలర్ ఓజ్జల బుచ్చిరెడ్డి,ఇంచార్జ్ కమిషనర్ రాజ్ కుమార్ , చర్ల పెళ్లి రాజేశ్వర్గౌడ్ , సానిటేషన్ ఇంచార్జ్ అక్షయ్ కుమార్ ,ముజీబ్, ధర్మేందర్, మున్సిపల్ సిబ్బంది, నాయకులు తదితరులు పాల్గొన్నారు
మెట్ పల్లి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు నూతన డ్రెస్ కోడ్ దుస్తులు పంపిణి




