Tuesday, 3 November 2026

రైతుల సమస్యలు పట్టించుకోకపోతే ఊరుకునేది లేదు

రైతుల సమస్యలు పట్టించుకోకపోతే ఊరుకునేది లేదు. రైతుల సమస్యలు పట్టించుకోకపోతే ఊరుకునేది లేదు.
భైంసా రూరల్ నవంబర్ 30 జనం సాక్షి

నిర్మల్ జిల్లా, భైంసా పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆనందరావు పటేల్  మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులకు పెద్దపీట వేస్తామని చెప్పి, అబద్ధపు హామీలిచ్చి రైతులను నట్టేట ముంచడం శోచనీయమని తెలిపారు. రైతులు పండించినటువంటి ప్రతి పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని, ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేయాలని, రైతుల కొరకు వ్యవసాయ రంగంలో రైతులకు లబ్ధి చేకూరే విధంగా అనేక సంస్కరణలు చేపట్టాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపుమేరకు, ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేయడం జరిగిందని, గతంలో నుంచి రైతుల పక్షాన బడుగు బలహీన వర్గాల పక్షాన పోరాటాలు నిర్వహించి వాళ్ళ అభ్యున్నతి కొరకు పాటుపడినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీదని. ఈరోజు ఎవరేన్ని పార్టీలు మార్చిన కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ జెండాను మోసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారని,బడుగు బలహీన వర్గాల కోసం ఏదైతే పార్టీ పనిచేస్తుందో అది కేవలం కాంగ్రెస్ పార్టీయేనని ఆయన ఈ సమావేశంలో తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యు ఐ జిల్లా ఇన్చార్జ్ ఆంజద్ షేక్, యూత్ కాంగ్రెస్ నాయకులు సూర్య వంశీ విలాస్ పటేల్, హైమద్ ఖాన్ సాబ్,టోపీ ఇస్మాయిల్ సహబ్, గజ్జరామ్, నకిడి నవీన్, భోజారం పటేల్, ,పర్ల శ్రీకాంత్, అంబేదర్ రాజు, నకిడి లక్ష్మణ్,రాథోడ్ రామ్నాథ్ నాయక్ షేక్ సలీం, షేక్ మాజీత్ తదితరులు పాల్గొన్నారు