మెట్ పల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు నిరుద్యోగుల సమస్యలపై మెట్ పల్లి బీజేవైఎం పట్టణ అధ్యక్షులు ఆర్మూర్ రంజిత్ ఆధ్వర్యంలో ధర్నా
మెట్పల్లి టౌన్, డిసెంబర్ 02,
జనంసాక్షి:
బలిదానాల బంగారు తెలంగాణలో నిరుద్యోగ యువకుల బ్రతుకులు మారలేదు, జారీ చేసిన నోటిఫికేషన్లకు వెంటనే నియామకాలు జరపాలి, హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి మొత్తం ఒక్కో నిరుద్యోగికి 3016 చొప్పున 48 నెలలకు గాను 144768 రూపాయలను వెంటనే చెల్లించాలి. అలాగే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని శాఖలకు నోటిఫికేషన్ లు జారీ చెయ్యాలని భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో ఈరోజు సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు బీజేవైయం పట్టణ అధ్యక్షులు ఆర్మూర్ రంజిత్ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బీజేవైయం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధోనికేల నవీన్ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేవైయం జిల్లా అధికార ప్రతినిధి బోడ్ల నరేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు రమేష్ యాదవ్, అరిగేలా అజయ్, కోరుట్ల రాజు, ప్రధాన కార్యదర్శి కలికోట శ్రీకాంత్, ఉపాధ్యక్షుడు పసునూరి ఆనంద్, కార్యదర్సులు భీమనతి విజయ్, మిట్టపల్లి శివ, జెట్టి రూపేష్, ముద్రకోలా రాజ్ కుమార్, కొమిరెడ్డి శేషు, రణధీర్, రవీందర్, ఇందురీ నవీన్, బాలు, ధ్యగాళ్ల కిషోర్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు
మెట్ పల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు నిరుద్యోగుల




