నిరుద్యోగ యువత వ్యాపార రంగంలో ఎదగాలి మోమిన్ పేట ఎస్సై విజయ ప్రకాష్

రుద్యోగ యువత వ్యాపార రంగాల్లో రాణించి ఆర్థికంగా లబ్ధి పొందాలని మోమిన్ పేట ఎస్ఐ విజయ్ ప్రకాష్ పేర్కొన్నారు శుక్రవారం మండల కేంద్రంలో స్మార్ట్ కార్ వాషింగ్ సెంటర్ ను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని యువకులు ఉపాధి అవకాశాలు వెతుక్కోవాల నీ ఆయన సూచించారు యువత చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా ఏదో ఒక వ్యాపారం చేసుకుంటూ ఆర్థికంగా స్థిరపడాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో స్మార్ట్ కార్ వాషింగ్ సెంటర్ యజమాని శేఖర్ యాదవ్ సర్పంచులు శ్రీనివాస్ రెడ్డి పాండు మల్లేశం పవన్ నగేష్ శ్రీనివాస్ రెడ్డి మర్పల్లి మోమిన్ పేట వివిధ పార్టీల నాయకులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు