భువనగిరి టౌన్ జనం సాక్షి:– మెడికో విద్యార్థిని ప్రీతీ మృతి పై వారి కుటుంబానికి వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ యదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మహమ్మద్ అతహర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియచేసారు.మృత్యువుతో పోరాడుతూ ప్రీతి తుది శ్వాస విడవడం చాలా బాధాకరమని ప్రీతి కుటుంబ సభ్యుల డిమాండ్ మేరకు వెంటనే సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపి దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.తెలంగాణ రాష్ట్రం లో ర్యాగింగ్ బూతాన్ని అంతం చేయాలని యువకులకు పిలుపునిచ్చారు. ర్యాగింగ్ అంతం చేయడానికి ప్రభుత్వం కఠిన చట్టాలు తేవాలని అతహర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలని అన్నారు.
మెడికో విద్యార్థిని ప్రీతి మృతి పై సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలని అతహర్ డిమాండ్




