Friday, 6 November 2026

మెడిసిన్ విద్యార్థికి ఆర్థిక సహాయం చేసిన కొండమల్లేపల్లి ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి

మెడిసిన్ విద్యార్థికి ఆర్థిక సహాయం చేసిన కొండమల్లేపల్లి ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి కొండమల్లేపల్లి డిసెంబర్ 19 జనంసాక్షి న్యూస్:
కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని దుర్గా నగర్ కాలనీలో నివాసముండే నిరుపేద కుటుంబానికి చెందిన అందుగుల వెంకటయ్య కుమార్తె గత సంవత్సరం ఎంబీబీఎస్ సీటు సంపాదించి చదువుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూన్నారు. ఈ సంవత్సరం కూడా హైదరాబాద్ లోని ఓ మెడికల్ కాలేజీలో మెడిసిన్ ద్వితీయ సంవత్సరం విద్యనభ్యసిస్తు ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చదువుకు ఆటంకం కలవకూడదని గమనించి సోమవారం రోజున విద్యార్థిని ఖర్చుల నిమిత్తం స్థానిక ఎంపిపి దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి తమ వంతు చేయూతగా 20,000/-రూ.లు వైస్ ఎంపిపి కాసర్ల వెంకటేశ్వర్లు చేతుల మీదుగా తన కార్యాలయంలో వారి కుటుంబ సభ్యులకు ఆర్ధిక సహాయం అందచేసారు.భవిష్యత్తులో మరికొంత సహాయం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులు యేకుల సురేష్, ఉప సర్పంచ్ మూడావత్ మంగ్యా నాయక్, కాంగ్రెస్ యువజన నాయకులు చేపూరి కార్తీక్, పెద్దిశెట్టి మహేందర్, రామావత్ సేవా నాయక్, యన్ యస్ యు ఐ స్టేట్ కోఆర్డినేటర్ యం. డి ఖధీర్, నాగేంద్ర,రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు.