Friday, 6 November 2026

తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో కళాజాత కార్యక్రమం

తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో కళాజాత కార్యక్రమం

వేమనపల్లి,డిసెంబర్ 19,(జనం సాక్షి):

వేమనపల్లి మండలంలోని చామనపల్లి గ్రామంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ నీల్వాయి శాఖ ఆధ్వర్యంలో కళాజాత బృందంచే ఆర్థిక అక్షరాస్యత సదస్సును నిర్వహించారు.ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ శివశంకర్ మాట్లాడుతూ రిజర్వ్ బ్యాంక్,నాబార్డ్ బ్యాంక్ వారి సహకారంతో కళాజాత బృందం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని అన్నారు.బ్యాంక్ సేవలు, ఇన్సూరెన్స్, గోల్డ్ లోన్,డిజిటల్ సేవలు,క్రాఫ్ లోన్ వివిధ పథకాలను ఖాతాదారులు వినియోగించుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ జెల్ల మొండి,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.