Tuesday, 3 November 2026

మెదక్‌లో సీఎం పర్యటన

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి నేడు మెదక్‌ జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన పటాన్‌చెరు మండలంలోని నందిగామకు రానున్నారు. మహిళా పారిశ్రామికవేత్తలు కోసం 70 ఎకరాల విస్తీర్ణంలో అసోసియోషన్‌ లేడీ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ ఆఫ్‌ ఆంద్రప్రదేశ్‌(ఎలీప్‌ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్న ఎలీప్‌ గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్కు పనులకు ఈ రోజు సాయంత్రం ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. సాయంత్రం నాలుగు గంటలకు సభా ప్రాంగణానికి చేరుకునే సీఎం, రాత్రి 7:30 గంటల&ఎ తిరిగి హైదరాబాద్‌ బయలుదేరుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *