మెరుగైన వైద్యం అందించాలి
జనంసాక్షి, మంథని : కరీంనగర్ లోని ఒమేగా హాస్పిటల్ లో కమాన్ పూర్ మండలం నాగారం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యాదగిరి రాజయ్య కుమారులు అనారోగ్యంతో, ముత్తారం కేశనపల్లి గ్రామానికి చెందిన కల్వచర్ల రాదమ్మ, ముత్తారం పాత్రికేయులు శ్రీధర్ రావు తండ్రి అనారోగ్యముతో చికిత్స పొందుతుండగా వారిని పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బందితో మాట్లాడి మెరుగైన వైద్యం అందించి త్వరగా కోలుకునేల చూడాలని కోరారు.