మేఘాలయ సీఎంగా ముకుల్ సంగ్మా ప్రమాణస్వీకారం
షిల్లాంగ్ : మేఘాలయ 23వ ముఖ్యమంత్రిగా ముకుల్ సంగ్మా నేడు ప్రమాణస్వీకారం చేశారు. ఆయన వరసగా రెండోసారి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ ఆర్‌ఎన్ మూషాహరి ముకుల్ సంగ్మాచేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ వారాంతంలో ముకుల్ సంగ్మా మంత్రివర్గాన్ని ఏర్పాటుచేయనున్నట్లు సమాచారం. వైద్యాధికారిగా పనిచేసే ముకుల్ సంగ్మా 2010 ఏప్రిల్ 20న సీనియర్ కాంగ్రెస్ నేత డీడీ లపాంగ్ స్థానంలో తోలిసారిగా ముఖ్యమంత్రి పదవి చేపట్టారు.