Thursday, 5 November 2026

మేడారం జాతరపై సర్కారు దృష్టి

వచ్చే ఏడాది జరగనున్న మేడారం జాతర నిర్వహణకు కసరత్తు ముమ్మరం చేసింది సర్కార్. రాష్ట్రం ఏర్పడ్డ అనంతరం మొదటిసారి నిర్వహిస్తున్న మేడారం జాతరను అంగరంగ వైభవంగా చేయాలని భావిసత్తుంది. గిరిజన సంస్కృతిక సంప్రాదాయలు ఉట్టిపడేలా నిర్వహించేలా ప్లాన్ చేస్తుంది ప్రభుత్వం. భక్తులు భారీ ఎత్తున హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది.వరంగల్ లోని మేడారం సమ్మక్క- సారలమ్మ జాతర ఏర్పాట్లనపై దృష్టిసారించింది ప్రభుత్వం. గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి చందులాల్ త‌న నివాసంలో మేడారం జాత‌ర ఏర్పాట్ల‌పై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి రెండెళ్లకోసారి వచ్చే మేడారం జాతర..తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మొదటిసారి వచ్చే ఏడాది ఫిబ్రవరి 17 నుంచి 20 తేదీ వరకు మూడు రోజులు నిర్వహించనున్నారు. జాత‌ర‌కు సుమారు కోటి మందికి పైగా భ‌క్తులు వ‌చ్చే అవ‌కాశ‌మున్నందున భ‌క్తుల‌కు ఎలాంటి అసౌక‌ర్యం క‌లుగ‌కుండా అభివృద్ది ప‌నులు చేప‌ట్టాల‌న్నారు మంత్రి చందులాల్. గిరిజ‌న సాంస్కృతి సాంప్ర‌దాయ బ‌ధ్దంగా జ‌రుపుకునే మేడారం జాత‌ర‌కు రాష్ర్టంతోపాటు… చత్తీస్‌ఘాడ్‌, మ‌హారాష్ర్ట‌, జార్ఖాండ్ ఇత‌ర రాష్ర్టాల నుండి భ‌క్తులు పాల్గొన‌నున్నారన్నారు. జాత‌ర‌లో శాశ్వ‌తంగా నిర్మించే అభివృద్ది ప‌నుల‌కు ప్రాధాన్యత క‌ల్పించాల‌ని అధికారుల‌కు సూచించారు మంత్రి చందులాల్. జాత‌ర‌కు రెగ్యుల‌ర్‌గా వ‌చ్చే భ‌క్తుల కోసం శాశ్వ‌తంగా టాయిలెట్లను నిర్మించాల‌ని ఆదేశించారు. జంప‌న్న‌వాగులో ఎల్‌లవేళ‌లో భ‌క్తులు స్నానం ఆచ‌రించే విధంగా నీటిని నిల్వ చేసేందుకు అద‌నంగా నాలుగు చెక్‌డ్యాంల‌ను నిర్మించాల‌ని ఆదేశించారు. భ‌క్తుల సౌక‌ర్యార్థం అంత‌ర్గ‌త రోడ్‌, టాయిలెట్స్‌, తాగునీరు వ‌స‌తులు, స్నాన ఘ‌ట్టాలు, ఇంజ‌నీరింగ్‌కు సంబంధించిన ప‌నుల‌ను ముంద‌స్తుగా చేప‌ట్టి జాత‌ర‌కు నెల రోజుల ముందే భ‌క్తుల‌కు సౌక‌ర్యాల‌ను అందుబాటులో ఉంచాల‌ని అన్నారు మంత్రి.జాతర నిర్వహణ ఖర్చు కోసం 11 డిపర్ట్ మెంట్స్ నుంచి మొత్తం 183కోట్ల రూపాయ‌ల‌కు నిధుల‌ను ప్ర‌తిపాధ‌న‌లు వచ్చినట్లు చెప్పారు మంత్రి చందూలాల్. ఇవీ గత జాత‌ర‌కు మూడంత‌ల ఎక్కువ అన్నారు మంత్రి. జాత‌ర ఏర్పాట్ల‌పై త్వ‌ర‌లో ముఖ్య‌మంత్రి స‌మీక్ష నిర్వ‌హించ‌నున్నట్లు చెప్పారు మంత్రి. రాష్ర్టంలో మొద‌టిసారిగా నిర్వ‌హించుకునే మేడారం జాత‌ర‌కు క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో ఏర్పాట్లు చేప‌ట్ట‌నున్నట్లు చెప్పారు మంత్రి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *