మైతాబ్ ఖాన్ గూడలో 20 లక్షల నిధులతో నూతన గ్రామపంచాయతీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కాలే యాదయ్య

వికారాబాద్ రూరల్ జులై 10 జనం సాక్షి

వికారాబాద్ జిల్లా నవాబ్ పేట మండల పరిధిలోని మైతాబ్ ఖాన్ గూడ లో 20 లక్షల రూపాయలతో నిర్మించనున్న నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి సోమవారం చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామ పంచాయతీల అభివృద్ధి ముఖ్యమని గ్రామపంచాయతీలో ఏర్పాటుకు నిధులు కేటాయించారని పేర్కొన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందుతే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. కెసిఆర్ పరిపాలన సౌలభ్యం కోసం నూతన గ్రామపంచాయతీలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. నూతన గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయడం వల్ల స్వపరిపాలన ఏర్పడిందని పేర్కొన్నారు. గతంలో ఇతర గ్రామపంచాయతీలో ఉండి ఎంతో ఇబ్బంది పడిన ప్రజలు, ప్రస్తుతం తమ గ్రామంలోనే గ్రామపంచాయతీ ఏర్పాటు కావడం ప్రజలకు శుభపరిణామమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ లింగంపల్లి అనిత రంగారెడ్డి, బి ఆర్ ఎస్ పార్టీ నవాబ్ పేట మండల అధ్యక్షుడు కందాడ నాగిరెడ్డి మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు రావు గారి వెంకట్ రెడ్డి పిఎసిఎస్ చైర్మన్ పోలీస్ రామ్ రెడ్డి జిల్లా నాయకుడు లింగంపల్లి రంగారెడ్డి మాది రెడ్డిపల్లి సర్పంచ్, ప్రభాకర్ ఎంపిటిసి విజయకుమార్ గేట్ వనంపల్లి సర్పంచ్ రత్నం బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

తాజావార్తలు