కొండమల్లేపల్లి జనవరి 18 జనం సాక్షి న్యూస్ : గుర్రంపూడ్ మండలం మైలాపురం గ్రామానికి చెందిన బొంత యాదగిరి నాగమణి ల కుమార్తె బొంత కావ్య(14) మరణానికి కారకులైన దిలీప్, శివ,నరేష్ అనే నర హంతకులను సమాజం నుండి బహిష్కరించి, ప్రభుత్వం వెంటనే స్పందించి ఉరితీయాలని ఇలాంటి చీడపురుగులను తగిన గుణపాఠం చెప్పాలని చందంపేట ఎంపీపీ నున్సవత్ పార్వతి చందు నాయక్ కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రౌడీ బాయ్స్ పేరిట వస్త్ర దుకాణ ముసుగులో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ చేసి తీవ్ర రక్తస్రావంతో అపస్మారస్థితిలోకి వెళ్లిన మైనర్ బాలికను అతికిరాతకంగా మైనర్ బాలిక మరణానికి కారకులైన మూర్ఖులను వెంటనే చట్టపరంగా శిక్షించి ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు ఇలాంటి మూర్ఖుల వల్ల సభ్యసమాజం సిగ్గుతో తలదించుకుంటుందని, ఆడపిల్లల తల్లిదండ్రులు భయంతో వణికి పోతున్నారని, ఆడపిల్లలను బయటికి పంపాలంటే ఎక్కడ ఎమ్ జరుగుతుందని వారి కుటుంబ సభ్యులు భయపడుతున్నారని తెలిపారు ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలంటే మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ నిందితులను ఉరిశిక్ష వేయాలని మూర్ఖుల చేతిలో అకాల మరణానికి బలి అయిన మైనర్ బాలిక బొంత కావ్య మరణానికి చింతిస్తూ వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ బొంత కావ్య కుటుంబానికి ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఆమె డిమాండ్ చేశారు గ్రామాలలో పట్టణాలలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు విపరీతంగా పుట్టగొడుగుల్లాగా ఉండడం వల్లనే యువత మద్యానికి బానిసై చెడు అలవాట్లను ప్రేరేపిస్తుందని, తండాలలో గ్రామాలలో పట్టణాలలో అనుమతి లేని మద్యం దుకాణాలు బెల్ట్ షాపులను సీజ్ చేయాలని వారు డిమాండ్ చేశారు
మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ నిందితులను వెంటనే ఉరితీయాలి చందంపేట ఎంపీపీ నున్సవత్ పార్వతి చందు నాయక్




