కొత్తగూడ జనవరి 18 జనంసాక్షి:మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని ఎంచగూడెం గ్రామంలో గ్రామ యాదవ సంఘం నూతన కార్యవర్గాన్ని బుధవారం రోజున మండల అధ్యక్షులు గద్ద అశోక్ ఆదేశాల మేరకు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో గౌరవ ఆధ్యక్షులుగా ఎడమ పెద్ద కుమారస్వామి యాదవ్,అధ్యక్షులుగా గజ్జి యాకయ్య యాదవ్,ఉపాధ్యక్షులు సంగి చిన్న లింగయ్య యాదవ్,ప్రధాన కార్యదర్శి బోల్లబోయిన రాజేందర్ యాదవ్,సహాయ కార్యదర్శి సంగి చిన్న శంకర్ యాదవ్, కోశాధికారి కొసన రమేష్ యాదవ్ లను గ్రామ పెద్దలు అందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.అనంతరం గజ్జి యాకయ్య యాదవ్ మాట్లాడుతూ యాదవ సంఘం బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు.యాదవుల హక్కుల కోసం కృషి చేస్తానని నాపై నమ్మకంతో నన్ను ఎన్నుకున్న యాదవ్ కులస్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ముడిక యాకయ్య,సుంకర బోయిన మొగిలి,మిరాల ఐలయ్య,జిట్టబోయిన యాకయ్య,సంగి యాకయ్య,బోల్ల బోయిన రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.




