Thursday, 5 November 2026

మైనార్టీ గురుకులంలో ఖాళీల భర్తీకి దరఖాస్తు చేసుకోండి

మైనార్టీ గురుకులంలో ఖాళీల భర్తీకి దరఖాస్తు చేసుకోండి
– ప్రిన్సిపల్ సంగీత
అశ్వారావుపేట, జనవరి 22(జనంసాక్షి )
అశ్వరావుపేట నియోజకవర్గం అశ్వరావుపేట పట్టణంలో ఉన్నటువంటి మైనార్టీ గురుకులం బాలికల పాఠశాలలో 2023 24 సంవత్సరానికి గాను 5 6 7 మరియు 8వ తరగతులలో ప్రవేశం పొందటానికి అర్హత గల విద్యార్థులు ఈనెల 15వ తేదీ నుండి 30వ తేదీ లోపు ఆన్లైన్ ద్వారా లేదా ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని పాఠశాల ప్రిన్సిపాల్ టి సంగీత ఒక ప్రకటనలో తెలిపారు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే విద్యార్థులు నేరుగా పాఠశాలకు వచ్చి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు w w w tmreis telangana gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఐదవ తరగతిలో మైనార్టీ విద్యార్థులకు 30 సీట్లు బీసీ 05 sc 02 st O2 oc 01 కలిపి మొత్తం 40 సీట్లు ఉన్నాయని అలాగే బ్యాక్లాగ్ సీట్లు ఆరో తరగతిలో మైనార్టీ10 ఏడో తరగతిలో ఐదు ఎనిమిదో తరగతిలో 6 సీట్లు ఉన్నాయని పేర్కొన్నారు రానున్న ఏప్రిల్ నెలలో డ్రా పద్ధతిలో విద్యార్థులను ఆయా తరగతులకు ఎంపిక చేస్తారని ఆమె తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల తల్లిదండ్రులకు వార్షిక ఆదాయం 1,50,000 పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రెండు లక్షలలోపు ఉండాలని తెలిపారు మరిన్ని వివరాలకు రింగురోడ్డు సెంటర్లో గల మైనార్టీ గురుకుల పాఠశాల వచ్చి లేదా మా 7995057877.. 9515165994 ఈ నెం బర్ లను సంప్రదించవలసిందిగా ప్రిన్సిపాల్ ఈ సంగీత తెలిపారు