సత్యసాయి ట్రస్ట్ ద్వారా
రాగి జావ పంపిణీ
విద్యార్థులకు గ్లాసుల వితరణ
వీణవంక జనవరి 12 (జనం సాక్షి )వీణవంక మండలంలోని మల్లారెడ్డిపల్లి గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు
సత్యసాయి ట్రస్ట్ ద్వారా రాగి జావ అందిస్తున్న సందర్భంగా ఎనబై మంది విద్యార్థులకు స్టీల్ గ్లాసులను పాఠశాలలోని ఉపాధ్యాయుడు పిఆర్టియు తెలంగాణ వీణవంక మండల శాఖ అధ్యక్షులు అయిలేని కరుణాకర్ రెడ్డి. ఈ రోజు పంపిణీ చేశారు.
ముఖ్య అతిథిగా విచ్చేసిన గ్రామ సర్పంచ్ మేకల ఎల్లారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే మనస్సును చదువుల మీద కేంద్రీకరిస్తారని పేర్కొన్నారు. రాగి జావా అందిస్తున్న
సత్యసాయి ట్రస్ట్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు
విద్యార్థులకు గ్లాసులు అందించిన ఉపాధ్యాయుడు కరుణాకర్ రెడ్డిని అభినందించారు
ఈ కార్యక్రమములో విద్యాకమిటీ చైర్మెన్ దూలం వెంకటేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పబ్బతి మనోహర్ రెడ్డి, ఉపాధ్యాయులు హైమావతి,రియాజుద్దీన్,తిరుపతి రెడ్డి , రమణారెడ్డి,రవిందర్ తదితరులు పాల్గొన్నారు




