మొక్కంపాడు తండా కి నాయక్, కారోబార్ ఎన్నిక

టేకులపల్లి, జులై 11( జనం సాక్షి ): బంజారాల సాంప్రదాయంగా అనాది నుండి వస్తున్న సాంప్రదాయంలో భాగంగా మొక్కంపాడు తండాకి నాయక్, కరోబార్ లను పెద్దలు, గ్రామస్తుల సమక్షంలో నియామకం జరుపుకున్నారు. తండావాసులు అంతా ఒక దగ్గరకు చేరుకుని అందరి ఇష్ట ప్రకారం గా బానోతు లాలు నాయక్ ను తండా నాయకునిగా, అజ్మీర రవిని కారోబార్ గా నియమించి పెద్దలందరూ ఆశీర్వదించారు. ఆ తండాలో శుభ అశుభ కార్యక్రమాలకు, పలు సమస్యలను తండావాసులతో చర్చించి పరిష్కరించడానికి వారు సహకరిస్తారు. తండావాసులంతా ఎలాంటి సమస్యలున్న వారి దృష్టికి తీసుకు వెళ్లాల్సి ఉంటుంది. సాంప్రదాయ పండుగలకు, ప్రతి విషయంలోను వారు ముందుంటారు. తండా అభివృద్ధి కోసం నాయక్ కారోబార్ సహకరించాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమానికి ఎంపీపీ భూక్య రాధా సైదులు నాయక్, సర్పంచ్ బానోత్ విజయ, కాంగ్రెస్ నాయకులు భూక్య దళసింగ్ నాయక్, బానోతు వాలు నాయక్, భాష్య నాయక్,చందవత్ రమేష్, బాదవత్ రాంబాబు,మాలోత్ హర్య నాయక్, మాలోత్ రాందాస్, మాలోత్ భీమా తదితరులు పాలుగొన్నారు.

తాజావార్తలు