ఏప్రిల్ 30 నుంచి సమ్మర్ కోచింగ్ క్యాంపుల ప్రారంభోత్సవం మొదటిసారిగా కంటోన్మెంట్ బోర్డ్ ఆధ్వర్యం లో ఏప్రిల్ 30 నుంచి సమ్మర్ కోచింగ్ క్యాంపుల ప్రారంభోత్సవం కంటోన్మెంట్ జనం సాక్షి ఏప్రిల్ 27 కంటోన్మెంట్ బోర్డ్ ఆధ్వర్యంలో సమ్మర్ కోచింగ్ క్యాంపులను 30 ఏప్రిల్ 2023నకంటోన్మెంట్ బోర్డ్ సివిలియన్ సభ్యుడు జె.రామకృష్ణ తో కలిసి కంటోన్మెంట్ బోర్డ్ సీఈవో మధుకర్ నాయక్ విలేకరుల సమావేశం నిర్వహించారు. మూడు ప్రాంతాల లో క్యాంపులు నిర్వహిస్తున్నట్లు వివరించారు, సిక్కు విలేజ్ ధోభి ఘాట్ హాకీ గ్రౌండ్, తిరుమలగిరి ఫుట్బాల్ గ్రౌండ్, బొల్లారం కంటోన్మెంట్ గార్డెన్ లో కోచింగ్ క్యాంపులు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ధోభి ఘాట్ ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో క్రీడలను ప్రారంభిస్తారు.ఈ సమ్మర్ కోచింగ్ క్యాంపు శిబిరాలను సద్వినియోగం చేసుకొని తాము ఎంచుకున్న క్రీడల్లో నైపుణ్యాన్ని పొందేందుకు విద్యార్థులు ఆరు నుండి 18 సంవత్సరాల పిల్లలు అవకాశం కల్పించడమే ఈ శిబిరం ముఖ్య ఉద్దేశమని సిఇఒ మధుకర్ నాయక్ తెలిపారు. ధోభి ఘాట్‌లోని హాకీ గ్రౌండ్‌లో వాలీబాల్, క్రికెట్, మార్షల్ ఆర్ట్స్ క్యాంపులు నిర్వహిస్తారు. తిరుమలగిరి ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో ఫుట్‌బాల్ క్యాంప్ జరగనుంది. బొల్లారం కంటోన్మెంట్ గార్డెన్‌లో క్రికెట్, మార్షల్ ఆర్ట్స నిర్వహించనున్నారు.ఈ శిబిరం 45 రోజుల పాటు నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మహేందర్, దేవేందర్,సయ్యద్ అక్బర్ ఆలీ తో పాటు పలు ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు




