Tuesday, 3 November 2026

కొనసాగుతున్న అంబేద్కర్ జయంతి ఉత్సవాలు

 

 

 

 

 

 

 

 

బిచ్కుంద ఏప్రిల్ 28 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్ మండలంలో గల సుల్తాన్ పెట్ గ్రామంలో శుక్రవారం నాడు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 132 జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గ్రామ యువకుడు మొహమ్మద్ అబ్బు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ అందరివాడని, ఆయన దూరదృష్టి వల్లనే చిన్న రాష్ట్రాల ఏర్పాటు గురించి రాజ్యాంగలో ఆర్టికల్ 3 ని పొందుపర్చూతెనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం పోరాటాల ఫలితంగా సాధించుకున్నామనీ పేర్కొన్నారు.  అలాగే అంబేద్కర్ ఆశయాల సాధన కోసం చిత్తశుద్ధితో ప్రభుత్వాలు పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేశారు. అలాగే బడుగు బలహీన వర్గాలు ఐక్యంగా ఉండి తమ హక్కులు సాధించుకొవాలని, సమస్యల పరిష్కారం కోసం పాలకులకు నిలదీయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక  సర్పంచ్ బాబు పటేల్, ఎంపీటీసీ దావుద్ పటేల్, మాజీ సర్పంచ్ రాములు, సంతోష్ పటేల్, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు మరియు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.