Wednesday, 4 November 2026

మొదటి నుంచి చివరివరకూ కాంగ్రెస్‌వాదే..

హైదరాబాద్ : అనారోగ్యంతో మృతి చెందిన పాలడుగు వెంకట్రావు మొదటి నుంచి కాంగ్రెస్‌వాది. చివరిదాకా ఆయన అలాగే కొనసాగారు. ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా  దశాబ్దాల పాటు కాంగ్రెస్‌కు సేవలందించిన వెంకట్రావుకు నెహ్రూ-గాంధీ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  విభజనను ఆయన గట్టిగా వ్యతిరేకించారు. పీసీసీ చీఫ్ రేసులో ఆయన పేరు చాలాసార్లు వినిపించినప్పటికీ సమీకరణాల కారణంగా పాలడుగుకు ఆ పదవి దక్కకుండా పోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *