హైదరాబాద్: ఆప్కాబ్ ఛైర్మన్‌గా మహబూబ్‌నగర్ డీసీసీబీ ఛైర్మన్ వీరారెడ్డి ఎన్నికయ్యారు. మొదటి రెండున్నరేళ్లు వీరారెడ్డి ఈ పదవిలో కొనసాగనున్నారు. తర్వాతి రెండున్నరేళ్లకు కరీంనగర్ డీసీసీబీ ఛైర్మన్ రవీందర్‌రావు బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ ఉదయం పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ జిల్లాల డీసీసీబీ, డీసీఎంఎన్ అధ్యక్షులతో భేటీ అయి ఇద్దరు నేతలను ఎంపిక చేశారు.




