Thursday, 5 November 2026

మోడల్ స్కూళ్ ప్రవేశ పరీక్ష

రుద్రుర్(జనంసాక్షి):
రుద్రుర్ మండలం అంబం గ్రామంలోని మోడల్ స్కూళ్లలో
తేదీ 16 -4 -2023 నాడు మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు, ఆరవ తరగతి ప్రవేశానికి ఉదయం పది గంటల నుండి 12 గంటల వరకు ఏడవ తరగతి నుండి పదవ తరగతిలో ప్రవేశానికి మధ్యాహ్నం రెండు గంటల నుండి నాలుగు గంటల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించబడుతుందని. ప్రవేశ పరీక్ష కొరకు ఆన్లైన్లో అప్లై చేసుకున్న విద్యార్థులందరూ హాల్ టికెట్ ను రెండు రోజుల ముందుగానే తీసుకొన వలసిందిగా మరియు ఎగ్జామినేషన్ సెంటర్ నకు ఒక గంట ముందుగా చేరుకొనవలసినది గా టిఎస్ ఎం ఎస్ అంబం ప్రిన్సిపల్ ఆలూరి నరేందర్ తెలిపారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు కోవిడ్ నిబంధనలు పాటించాలని మరియు బ్లూ లేదా బ్లాక్ పెన్ తో పాటు పెన్సిల్ ఎరేజర్ తో హాజరుకావాలని సూచించడమైనది.