Thursday, 5 November 2026

బిఆర్ఎస్ పార్టీలో భగ్గుమన్న వర్గ విభేదాలు ప్రోటోకాల్ పాటించడం లేదని ఎమ్మెల్యే అబ్రహంపై మంద, జెడ్పి చైర్మన్ ఫైర్

ఇటిక్యాల (జనంసాక్షి) ఏప్రిల్ 12 : బిఆర్ఎస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలలో అంతర్గత విభేదాలను, కలిసి పరిష్కరించుకోవాలనే దృక్పథంతో ఏర్పాటు చేస్తున్న ఆత్మీయ సమావేశంలో సొంత పార్టీ నాయకుల మధ్య ఉన్న వర్గ విభేదాలు భయటపడడం కోసమే ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసినట్లుగా మరో మారు బహిర్గతమైన సంఘటన బుధవారం కొండేరు గ్రామంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో చోటుచేసుకుంది. మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి సభఅధ్యక్షతన ఎమ్మెల్యే అబ్రహం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య ఆహ్వానితులుగా జిల్లా పరిషత్ చైర్మన్ సరిత, బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ మంద జగన్నాథం లు హాజరయ్యారు. ఈ ఆత్మీయ సమావేశంలో స్థానిక మాజీ జెడ్పీటీసీ కీర్తిశేషులు ఖగునాథ్ రెడ్డి, ఐజ మాజీ ఎంపీపీ కీర్తిశేషులు ఉత్తనూర్ తిరుమల్ రెడ్డి చిత్రపటాలకు పూలమాలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే అబ్రహం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల తీరుపై ఎమ్మెల్యే మండిపడ్డారు. బిజెపి ప్రభుత్వం ఆదాని, అంబానీలకు ప్రభుత్వ ఆస్తులను కట్ట పెట్టడం కోసమే పరిశ్రమలను, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తుందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో బిజెపి పార్టీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన తెలంగాణ రాష్ట్రంలో బి ఆర్ ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ అవుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రికి మనమంతా సహకారాలు అందించి నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరవేయలని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేవని, రాష్ట్ర అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని అని ఆయన అన్నారు. ప్రతిపక్ష పార్టీల రాజకీయ నాయకులు చెప్పే కల్లిబొల్లి మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం జడ్పీ చైర్మన్ సరిత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సంక్షేమ పథకాలు ప్రతి గడపకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన ఉన్నదని పార్టీ ప్రతిష్టాత, అభ్యర్థి గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆమె అన్నారు. తమకు పేరుకు మాత్రమే క్యాబినెట్ హోదా ఉన్నట్లు ఎదురుగా మాత్రమే సంబోధిస్తున్నారు తప్ప, సామాజిక మాధ్యమాలలో తమకు ఆహ్వానం ఎక్కడుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పద్ధతి మార్చుకోకుంటే మునుముందు జరిగే సమావేశలకు హాజరయ్యే ప్రసక్తి లేదని కరాకండిగా చెబుతున్నానని ఆమె అన్నారు.ఎంతటి వారైనా సరే,ఎవరికైనా సరే, ముక్కు సూటిగా ఉన్నది ఉన్నట్లు చెప్పడమే తన నైజమని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత ఎమ్మెల్యే అబ్రహంపై మండిపడ్డారు. అనంతరం ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి మంద జగన్నాథం మాట్లాడుతూ పార్టీ అంటే తాను ఒక్కడినే ఉన్నట్లు ఎమ్మెల్యే అబ్రహం వ్యవహరిస్తున్నారని, ఆయనకు ప్రోటోకాల్ తెలియడం లేదా సామాజిక మాధ్యమాల ఆహ్వానంలో కనీసం తన పేరు, జెడ్పి చైర్ పర్సన్ సరిత పేరు లేకపోవడం ఏమిటని ఆయన మండిపడ్డారు. తనను కేటీఆర్ పంపిస్తేనె అలంపూర్ ఆత్మీయ సమావేశాలకు హాజరవుతున్నాను తప్ప, తమకు ఎమ్మెల్యే అబ్రహం మధ్యల విభేదాలు ఉన్నట్లు కేటీఆర్ కి చెప్పడం జరిగిందని ఆయన అన్నారు. ఎమ్మెల్యే వ్యవహార శైలి ఒంటెద్దు పోకడ కారణంగా స్థానిక జడ్పిటిసి హనుమంత రెడ్డి, ఎంపీపీ స్నేహ, వైస్ ఎంపీపీ సుజాతమ్మ ఆత్మీయ సమ్మేళనాలకు రావడం లేదన్నారు. ఈ మధ్యకాలంలో ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్న చల్లా వెంకట్రామిరెడ్డి ఆయన వర్గంగా చెప్పుకుంటున్న మరి కొంతమంది నాయకులు ఆత్మీయ సమ్మేళనాలకు ఆమడ దూరంలో ఉన్నారు.ఎమ్మెల్యే అబ్రహం ఈ విషయాల పైన ఆత్మ విమర్శి చేసుకోవాలని అన్నారు.గత కొంతకాలం నుండి నియోజవర్గంలో ఏం జరుగుతుందో అన్నట్లు కార్యకర్తలను అయోమయం గురిచేస్తూ ఉన్నారని ఆయన తన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో జిల్లా సిపిఎం పార్టీ నాయకులు ఆంజనేయులు, అలంపూర్ బి ఆర్ఎస్ పార్టీ మాజీ ఇంచార్జ్ మంద శ్రీనాథ్, వడ్డేపల్లి జెడ్పిటిసి రాజు, స్థానిక సర్పంచ్ వీరన్న, మండల బీ ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మహేష్ రెడ్డి, ధర్మారం సర్పంచ్ మధు నాయుడు, దువాచపల్లి సర్పంచ్ మల్లన్న, ప్రాథమిక వ్యవసాయ శాఖ సభ్యుల గిడారెడ్డి, సంకాపురం రాముడు, వీరాపురం నాగేష్ నాయుడు, పెద్ద ఎత్తున బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు