Wednesday, 4 November 2026

మోడీకి గూగుల్‌ ఆహ్వానం

అహ్మదాబాద్‌ : ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌ ‘బిగ్‌ టెంట్‌ అక్టివేట్‌ సమ్మిట్‌ ‘లో ప్రసంగించేందుకు గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీకి ఆహ్వానం పంపింది. ‘రాజకీయాల్లో సాంకేతీకత ‘ అనే అంశంపై గూగుల్‌ హ్వాంగ్‌అవుట్‌ ద్వారా మార్చి 21న మోడీ ప్రసంగించనున్నారు. ప్రసంగానకి ముందు మోడీ గూగుల్‌ సంస్థ ఛైర్మన్‌ ఎరిక్‌తో సంభాషించనున్నారు. సామాజిక మీడియాలో మంచి ఆదరణ పొందుతున్న మోడీకి మాత్రమే భారత్‌ నుంచి ఈ ఆహ్వానం అందింది. మోదీకి ట్విట్టర్‌లో 13 లక్షల అభిమానులు ఉన్నారు. గూగుల్‌హ్యాంగ్‌అవుట్‌ సాంకేతిక ద్వారా మోడీ ఇది వరకే ప్రజలతో మమేకమయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *