Thursday, 5 November 2026

మోడీకి హటావో…  దేశ్ కో బచావో…మోడీకి హటావో

…  దేశ్ కో బచావో…* మల్లు స్వరాజ్యం ఆశయాలను సాధించాలి
ప్రధమ వర్ధంతి సభలో జూలకంటి….సాగర్మిర్యాలగూడ, జనం సాక్షి.దేశానికి ప్రమాదకరంగా మారిన మోడీని హటావో… దేశ్ కు బచావో అనే నినాదాన్ని ప్రజలలోకి తీసుకెళ్తున్నామని మాజీ ఎమ్మెల్యే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి టి సాగర్ తెలిపారు. వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు కామ్రేడ్ మల్లు స్వరాజ్యం ప్రథమ వర్ధంతి సభ సోమవారం స్థానిక టీఎన్ఆర్ గార్డెన్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిజెపి ఆర్ఎస్ఎస్ దేవుళ్ళ సెంటిమెంట్తో ప్రజల్లో విభేదాలు సృష్టిస్తున్నారని విమర్శించారు రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని ఆరోపించారు. దేశానికి అమ్మకానికి పెట్టిన  మోడీని అధికారం నుంచి దించేసి దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. నిత్యవసర ధరలు విపరీతంగా పెంచి సామాన్య ప్రజలు జీవించలేని పరిస్థితి నెలకొందని, ప్రభుత్వ రంగ సంస్థలను హోల్ సేల్ గా కార్పోరేట్ సంస్థలకు అమ్ముతున్నాడని ఆరోపించారు. అలాంటి మోడీని గద్ద దింపేందుకు ప్రజల సిద్ధం కావాలని కోరారు. రైతులకు రుణమాఫీ చేయాలని, కూలీలకు ఉపాధి కల్పించాలని, విద్యుత్ సవరణ చట్టం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సిసిఐ కేంద్రాన్ని ఎత్తివేసి పత్తి కొనుగోలు చేయకుండా పత్తి రైతులను ఇబ్బందులను గురి చేస్తున్నాడని ఆరోపించారు. కేంద్రం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించేందుకు సిపిఎం ఆధ్వర్యంలో జన చైతన్య యాత్రలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈనెల 26న జన చైతన్య యాత్ర మిర్యాలగూడకు వస్తుందని అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని కోరారు. చిన్న వయసులోనే ఎర్రజెండాను చేత బోని భూస్వాములకు వ్యతిరేకంగా విరోచిత పోరాటాలు మల్లు స్వరాజ్యం నిర్వహించిందని తెలిపారు. దోపిడీకి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టి చివరి శ్వాస వరకు ఎర్రజెండా సిద్ధాంతం కోసం పనిచేసిన గొప్ప నాయకురాలు అన్నారు. కమ్యూనిస్టు ఉద్యమంలో ఆమె పాత్ర కీలకమన్నారు. నిత్యం ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేపట్టి ప్రభుత్వాలను నివేదిశారని ఆమె పోరాటాలు మరువలేనిది అన్నారు. చట్టసభల్లో ఆమె మాట్లాడే తీరు అందరినీ ఆకట్టుకునేదని ఆయన ఆనాడే ఆమె మాటే.. తూటా అని చెప్పుకున్నారని గుర్తు చేశారు. ఎన్నో త్యాగాలు చేసి పార్టీ బలోపేతం కోసం పాటుపడ్డారని తెలిపారు. ఆమె ఆశయ సాధన కోసం కార్యకర్తల కృషి చేయాలని పిలుపునిచ్చారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్ శ్రీరాం నాయక్, జిల్లా కమిటీ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, మూడవత్ రవి నాయక్, డా. మల్లు గౌతమ్ రెడ్డి, భవాండ్ల పాండు,  రాగిరెడ్డి మంగా రెడ్డి, పరుశురాములు, ఆయూబ్, శశిధర్ రెడ్డి, వినోద్ నాయక్, సీనియర్ నాయకురాలు గాదె పద్మ, మల్లు వంశీ రెడ్డి, వేములపల్లి వైస్ ఎంపిపి గోవర్ధన, నంద్యాల కృపాకర్ రెడ్డి, బక్క శ్రీనివాస చారి తదితరులు పాల్గొన్నారు.