Thursday, 5 November 2026

ఉగాది పురస్కారానికి ఎంపికైన ప్రకృతి వైద్యురాలు డాక్టర్ శరణ్య యాదవ్

జనంసాక్షి, రామగిరి : పెద్దపెల్లి జిల్లా యాదవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉగాది పురస్కారాలు 2023 లో భాగంగా వివిధ రంగంలో సేవా కార్యక్రమాలు చేస్తున్న వారిని ఎంపిక చేసి ఉగాది రోజున సన్మానించడం ఆనవాయితీగా జరుగుతున్నది. ఇందులో భాగంగా మహిళ సేవారంగం విభాగంలో రామగిరి మండలం కల్వచర్ల గ్రామానికి చెందిన ప్రకృతి వైద్యురాలు డాక్టర్ శరణ్య యాదవ్ ఎంపిక కావడం జరిగింది. ఈ పురస్కారాన్ని ఉగాది పండుగ రోజున ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలో అందజేయనున్నారు.