వీసా విషయంలో ప్రభుత్వంతో మాట్లాడతాం
గుజరాత్ సీఎంకు అమెరికా చట్టసభ సభ్యుల ఆహ్వనం
ముఖ్యమంత్రి పని తీరు అద్భుతంగా ఉందని కితాబు
అహ్మదాబాద్, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ అబివృద్ది మంత్రం అమెరికా చట్టసభ సభ్యులు,వ్యాపారవేత్తలను విపరీతంగా అకట్టుకుంది గోద్రా అల్లర్లను సాకుగా చూపి 2005నుంచి మోడీకి వీసా ఇచ్చేందుకు అమెరికా ప్రభుత్వం నిరాకరిస్తుండగా ..తాజాగా తమ దేశానికి రావలంటూ ఆవేశ చట్టసటబ సభ్యులు,వ్యాపారవేత్తల బృందం ప్రత్యేకంగా మోడీని ఆహ్వనించడం గమనార్హం. అంతే కాదు గుజరాత్‌లో సాధించిన విజయాలను తమకు వివరించాలని కూడా కోరింది. మోడీకి వీసా జారీ విషయం పై ప్రభుత్వంతో మాట్లాడతామని చెప్పడం.
అమెరికా బృందం గురువారం గాంధీనగర్‌లో ముఖ్యమంత్రి మోడీతో సమావేశమైంది.అనంతరం బృందంలోని సభ్యులు విలేకరులతో మాట్లడారు.”అమెరికాకు రావల్సిందిగా మోడీని ఆహ్వనించాం.రాష్ట్రంలో సాధించిన విజయాలను మాకు వివరించాలని కోరాం”అని ఇల్లినాయిస్ చట్టసభ సభ్యుడు అరోన్ పేర్కోన్నారు. ఈఅహ్వన నేపథ్యంలో వీసా జారీ విషయంలో అమెరికా విదేశాంగ శాఖ వైఖరి మారిందని భావించొచ్చా అన్న విలేకరుల ప్రశ్నకు ఆయన స్పందించారు. వీసా జారీ అనేది అమెరికా ప్రభుత్వానికి సంబందించింది.అయితే ఈ విషయంలో మిగతా రిపబ్లికన్ సభ్యులతో కలిసి ప్రభుత్వంతో మాట్లాడతాం”అని చెప్పారు.రిపబ్లికన్ సభ్యులు సిందియా లుమిస్(వ్యోమింగ్),కేధీ ఎం,రోడ్జర్స్ (వాషింగ్టన్)లు కూడా మోడీని కలిసిన వారిలో ఉన్నారు.సిందియా మాట్లాడుతూ..మోడీ ప్రతిభను కోనియాడారు.తమ రాష్ట్రంలో అత్యదికంగా సహజవాయువు ఉత్పత్తి అవుతందని..గుజరాత్‌లోనూ ఎల్ ఎస్ జీ టర్మీనల్ ఉన్నందున ఇక్కడికి ఎగుమతి చేసేందుకు అసక్తిగా ఉన్నామన్నారు.మానవహక్కుల అంశం పై ముఖ్యమంత్రితో చర్చించారా అని విలేఖరులు అడగగా..లేదు అని అమె బదులిచ్చారు”రాష్ట్రంలో రెడ్ టెపిజాన్ని రూపుమాపి రెడ్ కార్పెట్(సాదర స్వాగతం)పలికేందుకు సిధ్దంగా ఉంటామని మోడీ అన్నారు” అని అమె వివరించారు.
జూన్‌లో అమెరికా పర్యటన అమెరికా బృందంలో సభ్యుడైన ఎన్ ఆర్ ఐ వ్యాపారవేత్త భాజపా ప్రవాస మిత్రుల సంఘం సభ్యుడు సలబ్ కూమార్ మాట్లాడుతూ ..జూన్‌లో మోడీ అమెరికా పర్యటన ఉండోచ్చన్నారు.




