Monday, 2 November 2026

మోడీ తో కెసిఆర్

kcr-invites-narendra-modiపెద్దనోట్ల రద్దు తర్వాత తెలంగాణలో నెలకొన్న పరిణామాలపై ప్రధాని మోదీతో చర్చించేందుకు ఢిల్లీ చేరుకున్న కేసీఆర్ ఉదయం నుంచి ఈ అంశంపై పలువురు ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. సాయంత్రం 4:40 గంటలకు ప్రధాని అపాయింట్‌మెంట్ ఖరారైంది. పెద్దనోట్ల రద్దు వల్ల రాష్ట్ర ఆదాయానికి గండి పడటంతో ఆ లోటు భర్తీచేయాలని కోరే అవకాశం ఉంది. ప్రధానంగా ఐదు అంశాలను ప్రధాని దృష్టికి తీసుకువచ్చేలా ఓ నివేదికను తయారు చేశారు. పెద్దనోట్ల రద్దుతో రాబోయే ఐదు నెలల్లో రాష్ట్రానికి రూ.3250కోట్ల నష్టం జరుగుతుందంటూ ఓ నివేదికను ప్రధానికి అందజేయనున్నారు. అలాగే నోట్ల రద్దుతో వస్తుసేవలు, వాణిజ్యపన్నుల ఆదాయం, రవాణాశాఖ, ఎక్సైజ్ ఆదాయం చాలా వరక కోత పడిందని, చిన్న వ్యాపారులు సైతం తీవ్రంగా నష్టపోతున్నారని, నిర్మాణ రంగం పూర్తిగా కుదేలైందని, రిజిస్ట్రేషన్, రవాణా విభాగంలో ఆదాయం బాగా తగ్గిందని ప్రధానికి వివరించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *