Friday, 6 November 2026

మోడీ మేడలు వొంచేది మాదిగలే.

మోడీ మేడలు వొంచేది మాదిగలే.
-19 న చలో ఢిల్లీ కార్యక్రమం విజయవతం చేయాలి.
-టీ ఎం అర్ పి ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జయశంకర్.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,డిసెంబర్16 (జనంసాక్షి)

ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని లేని పక్షంలో మోడీ మెడలు వంచుతామని టీ ఏం అర్ పి ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జయశంకర్ అన్నారు.శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఒక మందిరంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే వర్గీకరణ అమలు చేయించేందుకు మాదిగలు మాదిగ ఉపకులాలు యుద్దానికి సిద్దం కావాలని కోరారు. ఈ నెల 19 న చలో ఢిల్లీ కార్యక్రమం విజయవతం చేసి కేంద్రానికి సెగ తాకేలా చేయాలనీ అందుకు అందరం కలిసి కట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ప్రతి పక్షాలు పార్లమెంట్ లో తమ గళాన్ని వినిపించాలని డిమాండ్ చేశారు.బీజేపీ అధికారంలోకి వచ్చాక 100 రోజుల్లో వర్గీకరణ అమలు చేస్తాం అన్న మాట నిలబెట్టుకోవాలని లేని పక్షంలో బీజేపీ పార్టీని మోడీ నీ రానున్న ఎన్నికల్లో మెడలు వంచి బొంద పెడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీ ఏం అర్ పి ఎస్ తాలూకా అధ్యక్షుడు ఎర్రోళ్ల వెంకటస్వామి, జిల్లా అధికార ప్రతినిధి బొనాసీ రాజు, నాయకులు శివ, విష్ణు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.