Friday, 6 November 2026

గ్రామయువకుల ఆద్వర్యంలో బెల్టు షాపులు వద్ద నిరసన

గ్రామయువకుల ఆద్వర్యంలో
బెల్టు షాపులు వద్ద నిరసన

రుద్రూర్(జనంసాక్షి): రుద్రూర్ మండలంలో మద్యం ఏరులై పారుతోంది. నివారించాల్సిన ఎక్సైజ్‌ శాఖ అధికారులు, మండల అధికారులు, గ్రామ అధికారులు , పాలకులు మాముళ్ల మత్తులో పడటంతో బెల్టు షాపులు అడ్డూఅదుపు లేకుండా కొనసాగు తున్నాయి.మండల కేంద్రంలో ఎటూ చూసిన బెల్టు షాపులే దర్శనమిస్తున్నాయి అంతేకాకుండా ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయం చేస్తున్నారు .స్థానికంగా ఎన్నికైన ప్రజాప్రతినిధుల చురుకైన మద్దతుతో గ్రామ బెల్టు షాపులు నడుస్తున్నాయా అంటే గ్రామాల్లోని మూలాల నుంచి ‘అవును’ అనే సమాధానం వస్తోంది. ఇక అధికారుల, పాలకులకు చెప్పి ప్రయోజనం లేదని రుద్రూర్ మండల కేంద్రనికి చెందిన జవహర్ నగర్ కాలని యువకులు బెల్టు షాపుల వద్దకు వెళ్లి బంద్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో
కాలనీవాసులు వడ్ల నరేష్ అంకె రాజేష్ ,గట్టు ఆనంద్,రహీం, భాస్కర్ ,గణేష్, శివ, వైద్యుడు , మహేందర్ తదితరులు పాల్గొన్నారు