మోరి సమస్య పరిష్కరించండి..
– సయ్యద్ ఇమామ్, ఉరుసు
– కార్పొరేషన్ గ్రీవెన్స్ లో ఫిర్యాదు
వరంగల్ ఈస్ట్, నవంబర్ 14(జనం సాక్షి)
వరంగల్ నగరంలోని ఉరుసు చమన్ వద్ద గల బాక్స్ మోరి నిర్మాణం జాప్యంలో జరుగుతున్న సమస్యను వెంటనే పరిష్కరించాలని ఉరుసు ప్రాంతానికి చెందిన సయ్యద్ ఇమామ్ కోరారు ఈ మేరకు సోమవారం వరంగల్ మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలోని గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు. సుమారు రెండు నెలలుగా తమ గృహాల ముందు మోరి కోసం గుంతలు తవ్వి అలాగే వదిలేయడంతో మురుగునీరు నిలిచి దోమలు పెరిగి రోగాల పాలవుతున్నట్టు సయ్యద్ ఇమామ్ తెలిపారు. సంబంధిత అధికారులకు ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు ఈ సమస్య విన్నవించిన పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మోరి కోసం గుంతలు తవ్వి వదిలేయడంతో ఇంటి గోడలు శిథిలమయ్యే పరిస్థితి ఏర్పడిందని ఈ సమస్యను అధికారులు ప్రజాప్రతినిధులు సంబంధిత కాంట్రాక్టర్ వెంటనే పరిష్కరించాలని కోరారు.




