బాలల దినోత్సవం సందర్భంగా అంగన్వాడీ సెంటర్లో స్వీట్స్ పెన్సిల్స్ పంపిణీ
ఆత్మకూర్(ఎం) నవంబర్ 14 (జనంసాక్షి) బాలల దినోత్సవం సందర్భంగా ఆత్మకూరు మండల కేంద్రంలోని 6వ అంగన్వాడీ సెంటర్లో తెరాస మహిళ మండలి అధ్యక్షురాలు సోలిపురం అరుణ ఉపేందరెడ్ది పిల్లలకు స్వీట్స్ చాక్లెట్స్ పెన్సిల్ ఎరేజర్స్ పంపిణీ చేయడం జరిగింది అనంతరం సోలిపురం అరుణ మాట్లాడుతూ నేటి పిల్లల రేపటి భవిష్యత్తు పౌరులని తెలంగాణ ప్రభుత్వం ద్వారా పిల్లలకు చక్కటి విద్యను అందిస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆత్మకూరు అంగన్వాడి 6వ సెంటర్ టీచర్ తవిటి జానకి ఆయా రాచమల్ల సత్తమ్మ మరియు పిల్లలు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు




