మౌస్‌ సృష్టికర్త ఎంగల్‌బార్ట్‌ మృతి

న్యూయార్క్‌,(జనంసాక్షి): కంప్యూటర్‌ మౌస్‌ను కనుగొన్న డగ్లస్‌ ఎంగల్‌బార్ట్‌ (88) కన్నుమూశారు. కంప్యూటర్‌ రంగంలో మౌస్‌ ఆవిష్కరణ అనేక విప్లవాత్మక మార్పులకు దారితీసింది. కంప్యూటర్‌ రంగంలో కీలకమార్పులకు నాందిపలికిన మౌస్‌ను 1963లో డగ్లస్‌ తయారుచేశారు. ఈ మౌస్‌ను మరింత ఆధునీకరించి కంప్యూటర్లను మార్కెట్లో విడుదల చేశాయి.