Tuesday, 3 November 2026

మ్యాక్సివిజన్‌ ఆధ్వర్యంలో నేత్రాలపై అవగాహన

హైదరాబాద్‌ సిటీ : మ్యాక్సివిజన్‌ సూపర్‌ స్పెషాలిటీ కంటి ఆస్పత్రుల ఆధ్వర్యంలో మంగళవారం కంటి సంరక్షణపై అవగాహన కల్పించారు. కూకట్‌పల్లిలో కంటి డాక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, సిబ్బంది కాలేజీ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ‘మీ కళ్లను పరీక్షించుకోండి, మీ దృష్టిని కాపాడుకోండి, కళ్లను దానం చేసి ఆంధులను ఆదుకోండి’ అనే నినాదాలతో ఫ్లకార్డులను ప్రదర్శించారు. వచ్చే నెల 8న ప్రపంచ దృష్టిలోపం దినోత్సవం వరకునేత్రాల పరిరక్షణపై విస్తృత ప్రచారం నిర్వహించనున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలు, వృద్ధాశ్రమంలో ఉచిత నేత్ర పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. పలు సంస్థల నుంచి కళ్ల అద్దాలను సేకరించి వృద్ధులకు ఉచితంగా పంపిణీ చేస్తామని వైద్యులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *