Thursday, 5 November 2026

యాచారం మండల ఆర్యవైశ్య సంఘం నూతన కమిటీ ఎన్నిక

 

 

 

 

 

ఇబ్రహీంపట్నం, మార్చి 12 (జనంసాక్షి): యాచారం మండల పరిధిలోని మాల్ లో ఊరే యాదయ్య గార్డెన్ లో ఆదివారం ఆర్యవైశ్య సంఘం మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ కమిటీ ఎన్నికకు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఊరే జగన్, జిల్లా కోశాధికారి బిలకంటి కిరణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రతి ఒక్కరూ ఆర్యవైశ్య సంఘం అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఆ సంఘం నూతన అధ్యక్షులుగా మూడవ సారి వీరబొమ్మల శ్రీనివాస్ ను వరించగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నుకయ్యారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ… సంఘం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానన్నారు. ప్రతి నెలకోసారి ప్రతి గ్రామంలో ఆర్యవైశ్యులతో సమావేశం నిర్వహించి సంఘ అభివృద్ధికి చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే మండల కార్యవర్గ విస్తరణను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. శ్రీ వాసవి మాత ఆలయ నిర్మాణాన్ని త్వరలోనే నిర్మించేందుకు అందరు సహకరించాలన్నారు. నూతన అధ్యక్షులుగా తమని ఎన్నుకున్నందుకు రాష్ట్ర ఉపాధ్యక్షులు, జిల్లా కోశాధికారికి సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు రవీందర్ గుప్తా, రాజు, నాయకులు వీషెంశెట్టి సంతోష్, సురేందర్ గుప్తా, నాల్ల మురళి కృష్ణ, ఊరే శ్రీనివాస్, తడకమల్ల ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.