మందు ఫుల్,నిఘ నిల్


గద్వాల నడిగడ్డ, మార్చి 12 (జనం సాక్షి);
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో కొత్త బస్టాండ్ ముందర ఉన్న వైన్ షాపులో ఆదివారం సాయంత్రం నుండి మందుబాబులకు అధిక రేట్లకు విక్రయిస్తున్న ఎక్సైజ్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని గద్వాల జిల్లా ప్రజల ఆరోపిస్తున్నరు. ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికలు సోమవారం జరుగుతున్న దృశ్య ఎన్నికలు అయిపోయిన తర్వాత మందును విక్రయించరాదని సాక్షాత్తు ఎక్సైజ్ అధికారులు చెబుతున్న వారి మాటలను ఖతార్ చేయని వైన్ షాపులు యధాచంగా అధిక రేట్లకు విక్రయిస్తున్న పలకరించే నాధుడే లేడని మందుబాబులు లబోదిబోమంటున్నారు. ఎందుకు అధిక రేట్లకు విక్రయిస్తున్నారని వైన్ షాపుల వారిని అడిగితే ఎన్నికల కోడ్ ఉంది అసలు మందు ను విక్రయించరాదని అందుకే ఎక్కువ రేట్లకు విక్రయిస్తున్నమని వైన్ షాప్ యజమానులు తెలిపినట్టు మందుబాబులు తెలిపారు. జిల్లాలో ఎక్కడ చూసినా ఈరోజు ఆదివారం కావడంతో ఎక్కువ రేట్లకా మందులు అమ్మిన ఎవరూ పట్టించుకోవడంలేదని ఎక్సైజ్ అధికారులపై అనుమానాలు ఉన్నట్లు జిల్లాలోని ప్రజలు అనుకుంటున్నారు.