Wednesday, 4 November 2026

యాదవుల ఆరాధ్య దైవం అమరవరం లింగమంతుల స్వామి అభివృద్ధికి రూ. 40 లక్షలు నిధులు మంజూరు

 

 

 

 

 

 

హుజూర్ నగర్ మార్చి 7 (జనంసాక్షి): హుజూర్ నగర్ నియోజకవర్గంలో యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల ఉపేందర్ ఆధ్వర్యంలో యాదవ సామాజిక వర్గానికి సోమవారం ఆరాధ్య దైవం అమరవరం లింగమంతుల స్వామి గుట్ట అభివృద్ధి కొరకు 40 లక్షల రూపాయలను రెండు దాపాలుగా శాంక్షన్ చేయించి పనులు పూర్తి చేయించినందున యాదవుల తరఫున ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా మేళ్లచెరువు గంగమ్మ గుడి కి 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి పనులు పూర్తి చేయించారు. గత పాలకులు యాదవుల్ని పట్టించుకోని దాఖలా లేదు అంతేకాకుండా నియోజకవర్గంలో యాదవ్ సామాజి వర్గానికి ఏమైనా సమస్యలు ఉన్న ముందుండి తక్షణమే పరిష్కరించే ఎమ్మెల్యే సైదిరెడ్డికి యాదవ హక్కుల పోరాట సమితి నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.