జనం సాక్షి, చెన్నరావు పేట
మండలంలోని పాపయ్యపేట గ్రామంలో విషాదఛాయలు అలముకున్న కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు. వివరాల లోకి వెళితే చెన్నారావుపేట మండలం పాపయ్యపేట గ్రామంలో అన్నేబోయిన రాధమ్మ ( 58) సోమవారం సాయంత్రం మృతి చెందారు.కుమారుడు అన్నబోయిన స్వామి( 45) ఆరోగ్య రీత్యా బాగలేనందున హాస్పటల్ లో చికిత్స పొందుతున్నారు.అతని ఆరోగ్య పరిస్థితి బాగా లేనందున తల్లి మనోవేదనకు గురై తల్లి రాధమ్మ మరణించారు.ఆమెను ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకురాగా,వారి మరణ వార్త విన్న కుమారుడు స్వామి తన గుండెఆగి తుడి శ్వాస విడిచారు.ఒకే కుటుంబంలో తల్లి,కుమారుని మృతి తో
గ్రామంలో విషాద ఛాయలు అములుకున్నవి,కుటుంబ సభ్యులు రోదనలతో కన్నీరు మున్నీరు అయిన గ్రామ ప్రజలు.ఈ పేద కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయం ను అందించాలని కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు కోరుతున్నారు.




