Tuesday, 3 November 2026

విభజిస్తున్నప్పుడు ఏమయ్యారు.??

union-minister-of-urban-development-m-venkaiah-naiduఏపీకి ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు చేస్తున్న వారు, విమర్శిస్తున్న వారు..రాష్ట్రాన్ని ఏకపక్షంగా విభజిస్తున్నప్పుడు ఏమయ్యారని, ఎక్కడ ఉన్నారని, ఏం చేశారని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రశ్నించారు. వీటన్నింటికి బదులిచ్చాకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శిస్తే బాగుంటుందని ఆయా పార్టీలు, నాయకులకు సలహా ఇచ్చారు. సోమవారం ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధాని, తాను, చంద్రబాబు మోసం చేశారని అంటున్న వారంతా, విభజన సందర్భంగా ఏపీకి పచ్చిమోసం జరుగుతున్నప్పుడు ఎక్కడ ఉన్నారని నిలదీశారు. ఆంధ్రప్రదేశకు ప్రత్యేక హోదా అంశం ముగిసిన అధ్యాయమని స్పష్టం చేశారు. ఒక్కటైనా హామీ నెరవేర్చారా? అని కొందరు అడుగుతున్నారన్న వెంకయ్య.. ఐఐటీ, ఐఐఎం వంటి ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థలు ఏర్పడ్డాయని గుర్తు చేశారు. ఇవన్నీ చూసేవారికి కనబడతాయని, వినేవారిని వినబడతాయని వ్యాఖ్యానించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *