Thursday, 5 November 2026

యాదాద్రి నుంచి ఖమ్మం బయలుదేరిన ముఖ్యమంత్రులు

యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహ స్వామివారిని దర్శించుకున్న అనంతరం సీఎం కేసీఆర్‌ సహా ముగ్గురు ముఖ్యమంత్రులు, జాతీయ స్థాయి నేతలు ఖమ్మం బయలుదేరారు. మరికాసేపట్లో ఖమ్మం కలెక్టరేట్‌కు చేరుకోనున్నారు. సీఎం కేసీఆర్‌తోపాటు ముఖ్యమంత్రులు అరవింద్‌ కేజ్రివాల్‌, భగవంత్‌ మాన్‌, పినరయి విజయన్‌, ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌, సీపీఐ జాతీయ నేత డీ.రాజా ప్రత్యేక హెలికాప్టర్లలో యాదాద్రికి చేరుకున్నారు. అనంతరం పినరయి విజయన్‌, రాజా మినహా మిగిలిన నేతలు యాదాద్రీశ్వరుడిని దర్శించుకున్నారు. గర్భాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత ఆలయ పరిసరాలను పరిశీలించారు.
ఆ తర్వాత నలుగురు ముఖ్యమంత్రులు, జాతీయ నేతలు కలిసి ఖమ్మం బయలుదేరారు. అక్కడ నూతనంగా నిర్మించిన కలెక్టరేట్‌ను ప్రారంభించారు. తర్వాత సీఎం కేసీఆర్‌తోపాటు ముగ్గురు ముఖ్యమంత్రులు కలిసి రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం ఆరుగురికి కళ్ల అద్దాలు అందిస్తారు. మధ్యాహ్న భోజనం అనంతరం బీఆర్‌ఎస్‌ బహిరంగ సభలో పాల్గొంటారు.