Wednesday, 4 November 2026

యాదాద్రి భువనగిరి జిల్లా పద్మశాలి సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం…

యాదాద్రి భువనగిరి ( జనం సాక్షి ):–భువనగిరి పట్టణ సుమంగళి ఫంక్షన్ హాల్ లో జరిగినది ఇట్టి పద్మశాలి సంఘం జిల్లా కార్యవర్గ సమావేశంలో సెప్టెంబర్ 3న జరుప తలపెట్టిన పద్మశాలి శంఖారావం సరూర్నగర్ మహాసభకు మన జిల్లా నుండి అత్యధిక సంఖ్యలో అట్టి సమావేశానికి హాజరు కావాలని అట్టి సభను విజయవంతం చేయాలని ఈనాటి సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించినది ఇట్టి సమావేశానికి మన జిల్లా నుండి 150 బస్సులు తీసుకోవాలని అట్టి బస్సులలో మహిళలు పురుషులు అందరూ తరలి వెళ్లాలని నిశ్చయించడం జరిగినది ఇట్టి సమావేశంలో జిల్లా అధ్యక్షులు చిక్క వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మన జిల్లాలో గల 17 మండలాలు ఆరు మున్సిపాలిటీలు అట్టి మండలాల్లో గల గ్రామాల నుండి మన పద్మశాలీలను తరలించాలని శంఖారావం సభను విజయవంతం చేయాలని తెలియజేయడం జరిగినది ఇట్టి సమావేశంలో జిల్లా మహిళా విభాగం పూర్తి కార్యవర్గం జిల్లా యువజన విభాగం పూర్తి కార్యవర్గం మరియు జిల్లా ప్రముఖులు చిక్క వెంకటేశ్వర్లు బొట్ల పరమేశ్వర్ వంగారి బాల నరసయ్య చింత కింది శ్రీధర్ శ్రీరామ్ సత్తయ్య వలందాసు ఆదినారాయణ బింగి వైకుంఠం కాటబత్తిని ఆంజనేయులు మంత్రి బాలరాజు బింగి జంగయ్య గాడి పల్లి శ్రవణ్ సామల భాస్కర్ మరియు పూర్తి కార్యవర్గం పాల్గొన్నారు.