యానం: భారీ వర్షాల కారణంగా యానం పరిసర ప్రాంతాల్లో వృద్ధ గౌతమీ నదికి వరద పోటెత్తింది, వరద నీరు నివాస ప్రాంతాల్లోకి వచ్చి చేరడంతో 10 వేల కుటుంబాలు నీటమునిగాయి. పలు చోట్ల నుంచి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ఆలయాలు జలదిగ్బంధంలో చిక్కుకొన్నారు.




