Tuesday, 3 November 2026

యాసంగి ఆరుతడి పంటలపై దృష్టి సారించాలియాసంగి

యాసంగి ఆరుతడి పంటలపై దృష్టి సారించాలియాసంగి ఆరుతడి పంటలపై దృష్టి సారించాలిమండల వ్యవసాయ అధికారి హరీష్ కుమార్
రామారెడ్డి.  డిసెంబర్ 02    ( జనంసాక్షీ  )  :
యాసంగి ఆరుతడి పంటలపై దృష్టి సారించాలనిమండల వ్యవసాయ అధికారి హరీష్ కుమార్ అన్నారు. రామారెడ్డి మండల కేంద్రంలో రైతు వేధికలో రైతులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఏఓ మాట్లాడుతూ,  యాసంగి పంట సాగు లోని మెళుకువలు, నత్రజని ఎరువులు దఫా దఫాలుగా వేసుకోవడం, వరి లో నారుమడి యాజమాన్యం మరియు విత్తన శుద్ది, వరిలో వెదజల్లే పద్ధతి, పిఎస్బీ  (పాస్పరస్ , సొల్బిజింగ్ , బ్యాక్టీరియా )  ల  వాడకం మంచిదని సూచించారు. పీఎం కిసాన్ నాలుగు వందల పదహారు మంది  రైతులు చేసుకోలేదన్నారు. అట్టి రైతులు  చేసుకొని ఎడల వారికి  పీఎం కిసాన్   డబ్బులు రావన్నారు. . రైతులు అర్థం చేసుకొని రైతులు మూడు  రోజులలో చేసుకోగలరని స్పష్టంగా చెప్పారు.  ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి రాకేష్,  సోసైటి వైస్  అమ్ముల పశుపతి,  రైతుబందు డైరెక్టర్ కాసర్ల రాజేందర్, రైతు బంధు కోఆర్డినేటర్ బండ్ల బాలయ్య,    రైతులు పాల్గొన్నారు